1. బడికి నాలుగు కి.మి దూరంగా, ప్రభుత్వాస్పత్రికి ఎనిమిది కి.మీ దూరంగా, దురదృష్టానికి దగ్గరగా బ్రతుకుతున్నారు
2. పంటను పురుగు ఆశించింది. పురుగుల మందు చల్లాడు, పని చెయ్యలేదు. పురుగుల మందు తను తాగాడు, ఈ సారి పని చేసింది.
3. ఆకలైనా తినకుండా ఉంటే అది ఉపవాసం, నిద్రొచ్చినా పడుకోకుండా ఉంటే అది జాగరణ, చంపే అవకాశం వచ్చినా వదిలేస్తే అది మానవత్వం
4. రవి పార్కులాంటోడు. ఒక వారం చూస్తే, మరి కొత్తగా చూడటానికేమీ ఉండదు. సంజయ్ అలా కాదు, జీవితంలో ప్రతి రోజూ ఏదో కొత్తదనం చూపిస్తాడు.
5. నేనూ ఈ మధ్యే మార్గదర్శిలో చేరాను, ఒక తుపాకీ కొన్నాను
http://gsnaveen.wordpress.com/2008/04/21/jalsa_revie/ - పూతరేక్స్ నుండి