1. ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్య!
2. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్య!
3. సూర్య చంద్రులు ఉన్నంతవరకు వెంకయ్య ఎండేదే గదయ్య!
4. అగ్ని గుండం కోటి లింగాల పూజా గదయ్య!
5. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్య!
6. పావలా దొంగిలిస్తే పది రూపాయలు పోతుండ్లా అయ్యా!
7. ఆశకు పోతే అంతా పోతుండ్లా అయ్యా!
8. అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తుండ్లా అయ్యా!
9. వెయ్యి మందిలో ఉన్నా మన గొర్రెను కాలు పట్టి లాక్కురావచ్చయ్యో!
10. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడుకు వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదేకదయ్యా!
11. వెంకయ్య పేరుమీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వాంద్ల కుటుంబాల బాగోగుల్నీ చూదలికదయ్య!
12. వాళ్ళుండే దాన్ని బట్టి కదయ్య మనముండేది!
13. నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్య!
14. మనిషై పోతే మనిషిగా వస్తుండల్లయ్య!
15. ఒకళ్ళను పొమ్మనే కంటే మనమే పోతే బాగుండ్లాయ్య!
16. మైసూరు మహారాజు కనిపిస్తే మనాకేమోస్తుందీ, మనం చేసుకున్నదేకదయ్యా మనకు!
గొలగమూది క్షేత్రం
వెంకటాచలం మండలం
నెల్లూరు జిల్లా
ఫోన్-2341816